News

ప్రత్యేక హోదా అవసరం లేదు:రాజశేఖర్‌రెడ్డి


ప్రత్యేక హోదా అవసరం లేదని  రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోస్తా, రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందన్నారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి మద్ధతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నాయకులు పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెదేపాని ఉద్దేశించి బైరెడ్డి పరోక్షంగా విమర్శించారు.